![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -271 లో.. స్వప్నని కనకం ఇంటికి తీసుకొని వెళ్తానని వాళ్ళముందు కావాలనే అంటుంది. ఎందుకంటే స్వప్న తో పాటు తనని కూడా ఆ ఇంట్లో ఉండమని చెప్పాలని అనుకుంటుంది. ఆ తర్వాత నా కూతురిని ఇక్కడ మీరు ఎలా చూసుకుంటారో తెలియదు. అందుకే తీసుకొని వెళ్తానని కనకం అనగానే.. నువ్వు కూడా ఇక్కడే ఉండు అని ఇందిరాదేవి చెప్తుంది.
ఆ తర్వాత ఆ మాటకి కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పు పనులు మొదలు పెట్టాలని కనకo అనుకొని అన్నపూర్ణకి ఫోన్ చేసి.. నా బట్టలన్ని అప్పుతో పంపించు. రేపు తీసుకొని రమ్మని కనకం చెప్తుంది. రేపే ఎందుకని అన్నపూర్ణ అడుగుతుంది. రేపు పెళ్లి క్యాన్సిల్ అవ్వడం అప్పు చూడాలని కాన్ఫిడెంట్ గా కనకం చెప్తుంది. అ తర్వాత కనకం తెచ్చిన స్వీట్స్ స్వప్న తింటు.. కనకం, కావ్యల మీద సెటైర్ లు వేస్తుంటుంది. ఆ తర్వాత అనామిక, కళ్యాణ్ లు బాగుంటున్నారా అని కావ్యని కనకం అడుగుతుంది. బాగుంటేనే కదా పెళ్లి చేసుకుంటున్నారని? అయిన అలా అడుగుతున్నావేంటని కావ్య అనగానే.. అంటే మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు గొడవ పెట్టుకున్నారని కనకం చెప్తుంది. ఆ తర్వాత కావ్య ద్వారా పంతులు గారు ఎవరో తెలుసుకొని అతని దగ్గరికి వెళ్తుంది కనకం. కళ్యాణ్ ని అప్పు ప్రేమిస్తున్న విషయం చెప్పి.. జాతకాలు కలవలేదని చెప్పమని కనకం అతనికి చెప్తుంది.
ఆ తర్వాత పంతులు దానికి ఒప్పుకోడు.. అలా ఒప్పుకొకపోవడంతో సూసైడ్ చేసుకుంటానని పంతులిని బెదిరించి చివరికి పంతులు చేత అబద్ధం చెప్తాను అనేలా చేస్తుంది. ఆ విషయం ఎవరికి చెప్పకని చెప్తుంది. దానికి పంతులు గారు ఒప్పుకుంటారు. మరొక వైపు కావ్య, రాజ్ ఇద్దరు సరదాగా కౌంటర్ వేసుకుంటూ ఉంటారు. మరి కనకం ప్లాన్ ప్రకారం పెళ్లి క్యాన్సిల్ అవుతుందా... అప్పు ప్రేమ కళ్యాణ్ కి ఎలా తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |